Site icon Prime9

Cheating Case : సీరియల్ నటి మహాలక్ష్మి, సినీ నిర్మాత రవీంద్రన్ పై చీటింగ్ కేసు.. 16 కోట్లు మోసం చేశారంటూ

cheating case on producer ravindran worth of 16 crores

cheating case on producer ravindran worth of 16 crores

Cheating Case : సీరియల్ నటి మహాలక్ష్మి , సినీ నిర్మాత రవీంద్రన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది వీరిద్దరి పెళ్లిపై మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఈ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. రవీంద్రన్ చంద్రశేఖరన్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ వ్యక్తిని రూ.16 కోట్ల మేర మోసం చేసారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది.  ప్రస్తుతం ఈ కేసు విషయం హాట్ టాపిక్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి రవీంద్రన్ తన నుండి రూ.16 కోట్ల తీసుకుని మోసం చేసారని ఆరోపిస్తూ కొద్దిరోజుల క్రితం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలంలో ఫిర్యాదు చేసారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌ను ఇంధనంగా మార్చే రూ.200 కోట్ల విలులైన ప్రాజెక్టులో పెట్టుబడి కోసం రవీంద్రన్ తనను సంప్రదించారని తాను పెట్టుబడిగా రూ.16 కోట్లు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో తన డబ్బు ఇవ్వాల్సిందిగా కోరితే రవీంద్రన్ తిరిగి చెల్లించేందుకు నిరాకరించడమే కాకుండా తనను బెదిరించాడని బాలాజీ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. పోలీసుల దర్యాప్తులో రవీంద్రన్ ప్రాజెక్టు పేరుతో బాలాజీని నమ్మించి నకిలీ పత్రాలు తయారు చేసి మోసం చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్మాత రవీంద్రన్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Exit mobile version