Gujarath: గుజరాత్‌లో మోర్బీలో ఆదివారం నాడు 170ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
మోర్బి జిల్లాలోని మాచ్ నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 400 మందికిపైగా సందర్శకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇప్పటివరకు 132 మంది మరణించగా, 177 మందిని సురక్షితంగా నదిలో నుంచి బయటికి తీసుకొచ్చామని సహాయక సిబ్బంది వెల్లడించారు. మరో 19 మందికి గాయపడ్డారని వారిని ఆసుపత్రికు తరలించామన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరమ్మతుల అనంతరం వంతెనను ఈ నెల 26న తిరిగి ప్రారంభించారు. అయితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే బ్రిడ్జిని పునఃప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. నదిలో పడిపోయిన 400 మంది