Site icon Prime9

Bengaluru: ప్రేమికుడి చేతిలో హైదరాబాద్ యువతి హత్య

Bengaluru

Bengaluru

Bengaluru: ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికులు మధ్య వచ్చిన తగాదాలు దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించిన యువకుడి చేతిలో హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవనబీమా నగర పోలీస్ స్టేషన్ పరిధి కోడిహళ్లిలో హైదరాబాద్ కు చెందిన ఆంకాక్ష విద్యాసాగర్ (23) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు.

హత్యకు గల కారణాలు(Bengaluru)

హైదరాబాద్ కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్‌, ఢిల్లీకి చెందిన అర్పిత్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి కోడిహళ్లిలో ఓ ఇల్లు అద్దె తీసుకుని నివాసం ఉంటున్నారు. తాజాగా ఆకాంక్ష, అర్పిత్ లు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే విడిగా ఉండటం ఇష్టం లేని ఆంకాక్షపై కోపం తెచ్చుకున్నట్టు గుర్తించారు. ఇరువురు వేరుగా ఉండే విషయమై చాలా రోజులుగా గొడవ పడుతున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

సోమవారం రాత్రి ఇంట్లో వాదులాట పెట్టుకున్నారని.. అనంతరం ఆమె మెడకు చున్నీ చుట్టి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని డీసీపీ వివరించారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి అర్పిత్ పారిపోయాడని తెలిపారు. స్థానికలు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.

 

Exit mobile version