Site icon Prime9

GST bill: బాణసంచా సామాన్ల పై జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్లతో దాడి చేసారు..

 GST bill

 GST bill

Jharkhand: జార్ఖండ్ లో ఆర్మీ కల్నల్ మరియు అతని కుమారుడిని దీపావళి రోజున బాణసంచా కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్‌లతో కొట్టారు. ఈ విషయమై గోండా పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ కల్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఇషాన్ తండ్రి ఆర్మీ కల్నల్ గా ప్రస్తుతం రాజస్థాన్‌ గంగా నగర్ లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా దీపావళి జరుపుకునేందుకు ఇంటికి వచ్చాడు.

షాప్ యజమాని విమల్ సింఘానియా 15-20 మంది వ్యక్తులను సింగ్ మరియు అతని తండ్రిపై దాడి చేయమని ఆదేశించినట్లు ఇషాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. అక్టోబర్ 24న తండ్రీకొడుకులు పటాకులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాణసంచా నుగోలుకు వినియోగదారులకు జీఎస్టీ బిల్లు ఇవ్వలేదని దుకాణదారుడు చెప్పాడని ఇషాన్ తెలిపారు. మేము షాపు యజమానితో విషయాన్ని చర్చించడానికి ప్రయత్నించినప్పుడు, దుకాణంలో ఉన్న వ్యక్తులు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. మమ్మల్ని ఇనుప రాడ్‌తో కొట్టారు. ఈ దాడిలో మా ఇద్దరికీ గాయాలయ్యాయి అని ఇషాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేవలం జీఎస్టీ బిల్లు అడిగినందుకు మమ్మల్ని కొట్టడం చాలా బాధాకరం అని కల్నల్ సింగ్ అన్నారు. షాప్ యజమాని సోదరుడు కమల్ సింఘానియా క్షమాపణలు చెప్పారు. కేసును ఉపసంహరించుకోవడానికి తన ఇంటికి స్వీట్లు మరియు క్రాకర్లు పంపారు. మరోవైపు ఈ దుకాణంలోని ఒక ఉద్యోగి కల్నల్ సింగ్, అతని కుమారుడు ఇషాన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వీరిద్దరూ మొదట డిస్కౌంట్ అడిగారని, ఆపై గొడవకు దిగే ముందు ‘జాతి’ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని అతను ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version