Site icon Prime9

తెలంగాణ: పోర్న్ వీడియోలు చూపిస్తున్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన భార్య

hanumakonda

hanumakonda

Hanamkonda: కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

జిన్నారపు వేణు కుమార్ చిట్టీలు, గిరి గిరిలు నిర్వహిస్తూ కాజీపేటలోని డీజిల్ కాలనీలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. మృతుడికి ఇద్దరు భార్యలు. ప్రధాన నిందితురాలైన మొదటి భార్య జిన్నారపు సుస్మిత కాజీపేట రైల్వేలో లోకో పైడ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తుంది. రెండో భార్య సంతోష ఇంటి వద్దనే ఉంటుంది. మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కాగా రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు. మీరందరూ డిజిల్ కాలనీ నివాసం ఉండేవారు. గత కొద్ది రోజులుగా మృతుడు వేణు కుమార్ మహబూబాబాద్ లో మరో మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంతో నిందితురాలైన మొదటి భార్య సుస్మిత వేణు కుమార్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా, మరో మహిళతో మాత్రం సంబంధాన్ని వదులుకోలేదు. పైగా తన ఇద్దరు భార్యలను దూరం పెట్టేశాడు. దీంతో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిందితురాలైన మొదటి భార్య సుస్మిత నిర్ణయించుకుంది.

పధకంలో భాగంగా భర్తకు సేమియాలో స్లీపింగ్ టాబ్లెట్ లు ఇచ్చింది. తరువాత అనిల్‌ అనే వ్యక్తి మరో ముగ్గురు కలిసి సెప్టెంబరు 30న అపస్మారక స్థితిలో ఉన్న వేణు కుమార్ ను కారులో ఎక్కించుకుని కాళేశ్వరం – మంథని మధ్య ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. వేణుప్రసాద్‌ను హత్య చేసి అక్కడే మానేరు వాగులో పడేశారు. ఇదేమీ తెలియనట్టుగా నటించిన సుష్మిత అక్టోబరు 1న తన పిల్లలతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త ఆచూకీ చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. రెండ్రోజులకు ఓసారి పోలీసుస్టేషన్‌కి వెళ్లి భర్త ఆచూకీ కోసం వాకబు చేసేది. వేణుకుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకు సుష్మితపై ఎక్కడో అనుమానం రాగా, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆమె గుట్టును బయటపెట్టింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజు వేణుకుమార్ మొబైల్‌ ఫోన్‌ వెంట తీసుకెళ్లాడని ఓ సందర్భంలో పోలీసులకు చెప్పింది. అయితే, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ సుష్మిత ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల కిందట వేణుకుమార్ లో ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అతడితోపాటు సుష్మ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా ఫోన్ల కాల్‌ డేటాను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీంతో సుష్మితను విచారించిన పోలీసులు మూడు రోజుల కిందట అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుష్మిత చెప్పడంతోనే మరో ముగ్గురితో కలిసి వేణుకుమార్ ను చంపానని అనిల్‌ పోలీసులకు వెల్లడించాడు.

భర్త వేణు కుమార్ మర్డర్ కోసం సుస్మిత వద్ద అనిల్ 4 లక్షల రూపాయల డీల్ కుదర్చుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. ముందు రెండు లక్షలు తర్వాత రెండు లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ హత్య కేసులో A1 జిన్నారపు సుస్మిత, A2 కొంగర అనిల్ , A3 గడ్డం రత్నాకర్, A4 కటిక నవీన్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా డిసిపి వెల్లడించారు.

Exit mobile version