Attack On Tdp Leader : పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది.
టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇంట్లో నిద్రిస్తున్న బాలకొటిరెడ్డిని బయటకు పిలిచి ఆయనపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం అందుతుంది.
విషయం తెలిసిన టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆసుపత్రికి వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు.
దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వైసీపీ నేతలు పమ్మి వెంకటేశ్వరెడ్డితోపాటు ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలకోటిరెడ్డి రొంపిచెర్ల ఎంపీపీగా పని చేశారు.
కాగా కొద్ది నెలల క్రితమే బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. కత్తులతో దాడి చేసిన ఘటనలో బాలకోటిరెడ్డి గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.
తాజాగా స్వగ్రామం అలవాలలో ఆయనపై ప్రత్యర్థుులు మరోసారి కాల్పులతో హత్యాయత్నం చేశారు.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కాగా కొద్ది నెలల ముందే టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ పై చెన్నుపాటి గాంధీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజకీయ కారణాలే ఆ దాడికి కారణమని టీడీపీ నాయకులు అనమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పడమట డీ మార్ట్ వద్ద ఆ దాడి జరిగింది.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. దాడిలో గాంధీ కంటికి తీవ్ర గాయం అయిందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, కంటి చూపునకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని నేతలకు సూచించారు.
తెదేపా నేతలపై కిరాతకంగా దాడులు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/