Site icon Prime9

New Delhi : ఢిల్లీలో మరో దారుణం.,భర్తను చంపి 10 ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టింది.

New Delhi

New Delhi

New Delhi Crime News: శ్రద్ధా వాకర్‌ దారుణ హత్యపై ఢిల్లీలో విచారణ కొనసాగుతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతంలో పోలీసులు ఇలాంటి నేరాన్ని చేధించారు.తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో కుమారుడి సాయంతో భర్తను హత్య చేసినందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరే ఇక్కడకూడ శరీరం 10 ముక్కలుగా నరికివేసారు. ఈ ముక్కలు ఫ్రిజ్‌లో నిల్వ చేయబడి చాలా రోజులతరువాత పారవేయబడ్డాయి.

తాము నేరానికి పాల్పడినట్లు మహిళ, ఆమె కుమారుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు. తన భర్త అంజన్ దాస్ తన నగలను విక్రయించి, ఆ డబ్బును ఎనిమిది మంది పిల్లలతో బీహార్‌లో నివసిస్తున్న అతని మొదటి భార్యకు పంపాడని తెలుసుకున్న పూనమ్ ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె తన కొడుకు దీపక్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. పూనమ్ మాజీ భర్త 2017లో క్యాన్సర్‌తో మరణించారు, ఆ తర్వాత ఆమె దాస్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. దాస్ తన భార్యను వేధిస్తుండటంతో ఈ హత్యకు ప్లాన్‌ చేసినట్లు దీపక్ పోలీసులకు తెలిపాడు. దీపక్ పూనమ్ మొదటి భర్త కుమారుడు.

జూన్‌లో దాస్‌ను హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. అతనికి మత్తుపానీయం ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఆ తర్వాత మృతదేహాన్ని నరికి ముక్కలుగా పారవేశారు. ఇప్పటి వరకు ఆరు ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version