Site icon Prime9

Acid Attack: మేనమామే మృగమై… నోట్లో యాసిడ్ పోసి మరీ హత్య

Acid Attack on Minor Girl in Nellore

Acid Attack on Minor Girl in Nellore: మహిళలపై అఘాయిత్యాలు రానురాను ఎక్కువవుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. చిన్నాపెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనపడితే చాలు వారిపై దాడులు చేస్తున్నారు మృగాళ్లు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై సొంత మేనమామే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. దానిని ఆ బాలిక ప్రతిఘటించింది. దానితో చేతికందిన యాసిడ్ బాటిల్ తీసుకుని ఆమెపై పోసి మరి హత్యచేసిన ఘటన వెలుగుచూసింది.

ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండటంలోని చెముడుగుంట నక్కలకాలనీలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై తండ్రిలాంటి సొంత మేనమామే అత్యాచారాని ప్రయత్నించి హత్య చేసిన ఘటన పలువురుని కలచివేస్తుంది. బాలికపై కన్నేసిన నిందితుడు నాగరాజు కొన్నాళ్లుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. దానితో ఆ బాలిక అతనికి దూరంగా ఉంటూ అతనితో మాట్లాడడం లేదు. దానితో కోపం పెంచుకున్న నాగరాజు అదునుకోసం వేచిచూశాడు.  బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసుకుని నాగరాజు.. ఇంట్లో ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దానితో భయపడిపోయిన బాలిక తప్పించుకునేందుకు బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేస్తుండగా.. ఆమెను వెంబడించిన నాగరాజు తలుపు తోసుకుని బాత్రూంలోకి వెళ్లి బాలికపై అత్యాచారయత్నం చేశాడు.  దానిని ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తూ వద్దు మామయ్య నన్నేం చెయ్యవద్దు అంటూ ప్రాదేయపడినా వినని ఆ మృగం కోపంతో దగ్గరలోనే ఉన్న యాసిడ్ తీసుకుని ఆమె ముఖం మీద మరియు నోటిలో పోశాడు. యాసిడ్ మంట తట్టుకోలేక ఆ బాలిక కేకలు వెయ్యడంతో భయపడిపోయిన నాగరాజు ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

కేకలు విన్న స్థానికులు హుటాహుటిన ఇంట్లోకి వచ్చి చూడగా బాలిక రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి మేనమామ అయిన నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.

Exit mobile version