Minor Girl: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్లకే ఓ బాలిక పిసిబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు.
కానీ ఆ బాలిక చేసిన పనికి తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి.
తమ కూతురును బాగా చదివించాలని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు.
బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించారు. కన్న కూతురు బాగా చది ఉన్నత శిఖరాలకు చేరుతుంది అనుకున్నారు.
కానీ ఈ ఘటనతో వారి ఆశలు ఆవిరి అయ్యాయి. 14 ఏళ్ల బాలిక తల్లైందని చెప్పడంతో.. షాక్ కు గురయ్యారు.
ఈ విషయంపై గురుకులపాఠశాలలో ప్రశ్నించగా.. మా సమస్య కాదంటూ గురుకుల యాజమాన్యం చెప్పింది.
బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో.. వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలికకు వైద్యం చేసి బిడ్డను బయటకు తీశారు. తీరా ఆమె వయస్సు చూస్తే 14ఏళ్లు..
14 ఏళ్లకే ఆ బాలిక మరో పసిబాలుడికి జన్మనిచ్చింది.
అభం శుభం తెలియని ఆ బాలిక చేతిలో పసి పిల్లాడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గురుకుల యాజమాన్యం మాత్రం తమకేం సంబంధం లేదు అంటూ చేతులు దులుపుకుంది.
దీంతో ఆ పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
తల్లి కావడానికి కారణం అతడే..
మైనర్ బాలిక సోమలలో తాతయ్యల వద్ద ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది.
బాలిక ఇక్కడే ఆరో తరగతి నుంచి చదువుతుంది. 9వ తరగతి చదువుతుండగా తల్లి అయింది.
ప్రస్తుతం పసిబిడ్డను ఐసీడీసీ అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు ఎవరు కారణమో అనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈఘటనపై జిల్లా కలెక్టర్.. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలిక పుట్టడంపై డీసీఓ వెంకటరావు వివరణ ఇచ్చారు. వేసవి సెలవుల్లో బాలిక ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన తప్పిదమే కారణమని తెలిపారు.
బాలికకు పీరియడ్స్ రాకపోవడాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
తల్లిదండ్రులు సరైన చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. కాగా బాలిక మేమమామే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అదే జరిగితే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/