Site icon Prime9

Viral News: కుక్కను కారుకు కట్టేసి ఊరంతా తిప్పిన వైద్యుడు… వీడియో వైరల్

rajasthan doctor chains dog to car drags around city

rajasthan doctor chains dog to car drags around city

Viral News: బాధ్యత గల వృత్తిలో ఉండి మానవత్వంతో సేవ చేయాల్సిందిపోయి… కర్కశంగా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాల్సిన వైద్యుడు ఓ మూగజీవి ప్రాణం తీసేందుకు యత్నించాడు. తన వీధిలో తిరుగుతూ ఉండే శునకం బాగా విసిగిస్తుందనుకున్నాడో ఏమో కాస్తైనా కనికరం లేకుండా వీధికుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కుక్కను కారుకు కట్టేసి ఊరంతా పరిగెత్తించాడు. కారు వెంట పరుగెత్తలేక ఆ మూగజీవి చిత్రహింస అనుభవించింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ రజనీశ్‌ గల్వా ఇంటి సమీపంలో ఓ వీధికుక్క ఉంది. దానికి మానవత్వంతో ఆహారం అందించాల్సింది మరచి… దానిని ఊరిబయట వదిలిపెట్టాలనుకున్నాడు. ఆ కుక్క మూతికి తాడు కట్టి.. దానిని తన కారుకు కట్టేసి ఊరంతా పరిగెత్తించాడు. ఈ క్రమంలో కారుతోపాటు పరిగెత్తలేకపోయిన ఆ కుక్కను ఓ బైకర్‌ గమనించారు. దానిని వీడియో తీశాడు. వెంటనే ఆ కారును వెంబడించి ఆపాడు. కుక్క మూతికి ఉన్న తాడు విడిపించాడు. నగరంలోని డాగ్ హోమ్ ఫౌండేషన్‌కు ఈ ఘటనపై సమాచారం అందించాడు.

కాగా వెంటనే స్పందించిన వారు తీవ్రంగా గాయపడిన కుక్కను రక్షించేందుకు స్థానికుల సహాయంతో అంబులెన్స్‌ను  ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బైకర్ తీసిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంతు ప్రేమికులు ఆ డాక్టర్పై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు.

ఇదీ చదవండి: Crime News: సూల్క్ లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

Exit mobile version