Site icon Prime9

Saipriya : భర్తను ఏమార్చి ప్రియుడితో పరారీ.

Saipriya

Saipriya

Saipriya: విశాఖ బీచ్​లో గల్లంతై.. నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు గాను, కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు.

బీచ్‌లో మునిగిపోయినట్టు నమ్మించి ప్రియుడితో పారిపోయిన సాయిప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖకు చెందిన సాయిప్రియ గత నెల 25న పెళ్లిరోజున భర్తతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లి చీకటి పడిన తర్వాత భర్తను ఏమార్చి రవితేజతో కలిసి పరారైన విషయం తెలిసిందే. సాయిప్రియ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు. రెండు రోజుల పాటు నేవీ, కోస్ట్‌గార్డ్‌ సహాయంతో హెలికాప్టర్‌, షిప్‌లతో సముద్రంలో గాలించారు.

సాయిప్రియ గల్లంతు మిస్టరీగా మారింది. దీంతో బెంగళూరు ఉన్న ఆమె తాను రవితేజతో కలిసి క్షేమంగా ఉన్నానని, తాము పెళ్లి చేసుకున్నామని, తన తండ్రి సెల్‌ఫోన్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపింది. దీంతో ఆమె అదృశ్యంపై మిస్టరీ వీడిపోయింది. అయితే సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్‌, పోలీసుల సమయం వృథా అయింది. పైగా భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు అనుమతించాలంటూ పోలీసులు కోర్టును కోరారు.కోర్టు అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై నమోదు చేసినట్టు తెలిపారు.

Exit mobile version