Site icon Prime9

Panjab Crime News: రేప్ సీన్ రివర్స్.. ఓ అబ్బాయిపై నలుగురు అమ్మాయిల అత్యాచారం

4 girls gang raped a boy in jalandhar

4 girls gang raped a boy in jalandhar

Panjab Crime News: సాధారణంగా రేప్ జరిగిందంటే అయ్యో పాపం అమ్మాయి అంటాము. కానీ ఇక్కడ మాత్రం ఇదెక్కడి దారుణం.. కలికాలం అంటే ఇదేనేమో అని విన్నవారు ముక్కున వేలేసుకుంటూ నివ్వెరపోవాల్సిన స్థితి. ఈకేసులో అత్యాచారం జరిగింది అమ్మాయిపై కాదండి అబ్బాయిపై.. అందులో నలుగురు అమ్మాయిలు అడ్రెస్ అడిగినట్టూ అడుగుతూ అతడికి మత్తు మందు ఇచ్చి మరీ సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారట ఈ విషయం బాధితుడే పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పంజాబ్ లో జలంధర్ లో చోటుచేసుకుంది.

దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ చాలా దారుణాలు చోటుచేసుుకుంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలపై ప్రతిరోజూ ఘోరాలు జరుగుతున్నాయి. బయటకు వెళ్లిన అమ్మాయి ఇంటికి క్షేమగా వస్తుందా లేదా అనే భయం ఉంటోంది. అయితే తాజాగా పంజాబ్ లో జరిగిన ఘటనతో పురుషుడికి కూడా భద్రత లేదు అనుకోవాల్సి వస్తుంది. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన ఓ వ్యక్తిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తి సోమవారం తన పని పూర్తి చేసుకొని బస్సు కోసం ఎదురు చూస్తుండగా కారులో వచ్చిన నలుగురు అమ్మాయిలు అడ్రస్ అడుగుతూ తనకు మత్తుమందు ఇచ్చారని తెలిపాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన తనను ఓ అడవిలోకి తీసుకెళ్లి మరీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితుడు ఆరోపించాడు. కాగా ఈ విషయాన్ని ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని చెప్పలదేని కానీ తన భార్య బలవంతం మీద ఇప్పుడు మీడియా ముందు చెబుతున్నట్లు బాధితుడు చెప్పాడు. దానితో అతను చెప్పిన దానిని పరిగణలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు.. భయాందోళనలో గ్రామస్థులు

Exit mobile version