SHAR Suicides: ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని షార్ (శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్) వద్ద వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్నాయి.
వరుస ఆత్మహత్య నేపథ్యంలో షార్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
నిన్న 24 గంటల్లో ఎస్సై, జవాన్ ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
కాగా, తాజాగా ఎస్సై వికాస్ సింగ్ భార్య ప్రియాంక సింగ్ సూసైడ్ చేసుకోవడం మరింత భయానక వాతారణాన్ని సృష్టిస్తోంది.
తన భర్త వికాస్ సింగ్ మృతదేహాన్ని చూడడానికి షార్ కి వచ్చిన ప్రియాంక సింగ్.. మంగళవారం రాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు.
అయితే దీని వెనుక కారణాలేమై ఉండొచ్చని కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
కుటుంబ ఆర్థిక వ్యవహారాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే మూడు నెలల క్రితమే శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో(SHAR Suicides) వికాస్ సింగ్ ఎస్సైగా విధుల్లో చేరారు.
మచ్చటగా మూడు నెలలు కూడా నిండకుండానే ఇలా బలవన్మరణం చేసుకోవడంపై అతని కుటుంబ సభ్యులతో పాటు షార్ ఉద్యోగులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు.
ఇలా 72 గంటల వ్యధిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావిస్తున్నారు.
సోమవారం ఉదయం సీఐఎస్ఎఫ్ జవాన్ చింతామణి చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకోగా, ఆ రోజే సాయంత్రం సమయంలో ఎస్సై వికాస్ సింగ్ తన గన్ తో తానే కాల్చుకుని మరణించారు.
ఛత్తీస్ ఘడ్ కు చెందిన 29 ఏళ్ల చింతామణి.. 2021లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని షార్ యూనిట్ లో బాధ్యతలు చేపట్టారు.
కొన్ని నెలల క్రితం ఆయనకు పెళ్లి కుదిరింది. ఎంగేజ్ మెంట్ అయిన కొద్ది రోజులకే అతని మామ మృతి చెందారు.
ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో రోడ్డు ప్రమాదంలో చింతామణి తమ్ముడు కోమాలోకి వెళ్లిపోయాడు.
ఇక, ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన చింతామణి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు.
అటు సూసైడ్ చేసుకున్న మరో జవాన్ వికాస్ సింగ్ స్వస్థలం బీహార్. ప్రస్తుతం అతను కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా సోమవారం సాయంత్రం వేల తన గన్ తో షూట్ చేసుకుని వికాస్ సింగ్ మరిణించారు. వికాస్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇతని మరణానికి ఆర్థిక పరమైన ఇబ్బందులే కారణమై ఉండవచ్చని సమాచారం.
ఇలా గత మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోవడంతో షార్ లో భయానక వాతావరణం నెలకొంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/