Site icon Prime9

Train Accident: రైలు ఢీ కొని.. ముగ్గురు చిన్నారులు దుర్మరణం

3-children-killed-in-a-train-collision-in-punjabs-kiratpur-sahib

3-children-killed-in-a-train-collision-in-punjabs-kiratpur-sahib

Train Accident: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.

పంజాబ్ లోని కిరత్‌పూర్‌ సాహిబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సట్లేజ్‌ నదిపై ఉన్న లొహంద్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న చెట్లకు ఉన్న పండ్లు నలుగురు చిన్నారులు కలిసి తెంపుకున్నారు. అనంతరం వారు పక్కనే ఉన్న రైల్వే పట్టాలపై కూర్చుకుని వాటిని తింటున్నారు. అదే సమయంలో సహరాన్‌పూర్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండా ఆ చిన్నారులు పండ్లను తింటూ ఉండిపోయారు. దీనితో రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ చిన్నారి కూడా మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరొక పిల్లవాడికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దానితో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: భగీరథ్ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం..!

Exit mobile version