Site icon Prime9

సిక్కిం: ప్రమాదవశాత్తు లోయలో పడి.. 16 మంది ఆర్మీ జవాన్లు మృతి

16 members of indian army jawans killed by road accident in sikkim

16 members of indian army jawans killed by road accident in sikkim

Sikkim: వారి ప్రాణాలను ఫణంగా పెట్టి దేశానికి రక్షణగా ఉంటున్న ఆర్మీజవాన్లు బార్డర్స్ లో గస్తీ కాస్తుంటారు. అలాంటి ఆర్మీ జవాన్లు కొందరు నేడు నార్త్ సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు మలుపు తిరుగుతూ లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

మూడు ఆర్మీ వాహనాల కాన్వాయి నార్త్ సిక్కింలోని థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు మరణించారు. వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నారు. కాగా మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో సహాయంతో క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరజవాన్లు అందించిన సేవలు, నిబద్ధతను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: పోలీసులకు లొంగిపోయిన 600 మంది మావోయిస్టు మద్దతుదారులు.. ఎందుకంటే..?

Exit mobile version