Site icon Prime9

World Wealthiest Cities: హైదరాబాద్ లో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో తెలుసా..?

World Wealthiest Cities

World Wealthiest Cities

World Wealthiest Cities:హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అనే సంస్థ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. 11,100 మంది మిలియనీర్లతో హైదరాబాద్ 65 స్థానంలో నిలిచింది. ఈ జాబితా లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలిచింది. 2022 డిసెంబర్ 31 నాటికి న్యూయార్క్ లో 3,40, 000 మంది మిలియనీర్లు ఉన్నట్టు తెలిపింది. హెన్లీ అండ్ పార్ట్ నర్స్ విడుదల చేసన ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగామొత్తం 97 పట్టణాలు చోటు దక్కించుకున్నాయి.

 

నాల్గో స్థానానికి పడిపోయిన లండన్(World Wealthiest Cities)

తూర్పు ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాసియా, సీఐఎస్‌, మధ్యప్రాచ్యం ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించిన హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంపన్న నగరాల లిస్ట్ ను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా నుంచి అత్యధిక నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇదే సంస్థ 2000లో విడుదల చేసిన జాబితాలో లండన్ టాప్ ప్లేసులో నిలిచింది. కానీ ఇప్పటి జాబితాలో లండన్‌ నాల్గొ స్థానానికి పడిపోయింది.

 

New York City tops the list of world's wealthiest cities 2023. Here's the full list | World News,The Indian Express

నగరాల జాబితా ఎలా ఉందంటే..

ఈ జాబితాలో 2,90,300 మంది మిలియనీర్లతో జపాన్‌ రాజధాని టోక్యో రెండో స్థానంలో నిలిచింది. 2,85,000 మందితో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా మూడో స్థానంలో ఉంది. ఈ తర్వాతి స్థానాల్లో లండన్‌ (2,58,000), సింగపూర్‌ (2,40,100), లాస్‌ ఏంజెల్స్‌ (2,05,400), హాంకాంగ్‌ (1,29,500), బీజింగ్‌ (1,28,000), షాంఘై (1,27,200), సిడ్నీ (1,26,900) లు ఉన్నాయి.

ఇక భారత్‌ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై 59,400 మంది మిలియనీర్లతో 21వ స్థానం దక్కించుకొంది. తర్వాత 30,200 మిలియనీర్లతో ఢిల్లీ 36వ స్థానంలో, బెంగళూరు 12,600 మందితో 60వ స్థానంలో, కోల్‌కతా 12,100 మందితో 63వ స్థానంలో ఉండగా.. 11,100 మందితో హైదరాబాద్‌ 65వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో 2012 నుంచి 2022 మధ్య అత్యధిక నికర సంపద ( High net worth) కలిగిన వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగినట్టు జాబితా వెల్లడించింది.

 

 

Exit mobile version
Skip to toolbar