Anil Agarwal: దేశంలోనే తయారయ్యే సెమీకండక్టర్లు వల్ల ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుతాయని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో పలుకుతున్న ల్యాప్ ట్యాప్ ధరలు వేలల్లో కొనుగోలు చెయ్యవచ్చన్నారు.
భారత్‌లోనే గ్లాస్, సెమీకండక్టర్లు తయారయితే బాగుంటుందని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దాని ద్వారా ప్రస్తుతం మార్కెట్‌లో లక్ష రూపాయలున్న ల్యాప్‌టాప్‌ను రూ.40 వేలకే కొనుగోలు చెయ్యవచ్చని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత కాలంలో తైవాన్, కొరియాల్లో మాత్రమే గ్లాస్ ఉత్పత్తి అవుతుందని, అతి త్వరలోనే భారత్‌లోనూ తయారవుతుంది అంటూ బుధవారం ఓ ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ అగర్వాల్ వెల్లడించారు.
యాపిల్ ఫోన్ల తయారీలో ఫాక్స్‌కాన్ టెక్నాలజీనే కీలకం. అలాంటి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో కలిసి వేదాంత సెమీకండక్టర్ల ప్లాంట్ పెడుతున్న నేపథ్యంలో ల్యాప్‌టాప్ లతో పాటు, ఫోన్లు, ఈవీలనూ తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, వచ్చే రెండేళ్లలో ఈ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హైడ్రోజన్ సెల్… ఎక్కడైనా ఎప్పుడైనా దీని ద్వారా కరెంట్