Site icon Prime9

HONDA Electrical Scooters: యాక్టివా కంటే తక్కువ ధరకే హోండా ఎలక్ట్రికల్ స్కూటర్..!

Honda electrical scooters cheaper than activa

Honda electrical scooters cheaper than activa

HONDA Electrical Scooters: హోండా యాక్టివా, హీరోహోండా బైక్లు తెలియని భారతీయులు ఉండరు. సామాన్యుల బడ్జెట్కు అనుగుణంగా లభించే ఈ టూవీలర్లు తయారీ చేసి హోండా మోటార్ సైకిల్స్ సంస్థ ఆటోమొబైల్ రంగంలో దిగ్విజయంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగినట్టుగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగింది. మోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో మార్కెట్లో లాంఛ్ చెయ్యనుంది. కాగా యాక్టివా కంటే తక్కువ ధరతో హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. సరసమైన ధరలతో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లే లక్ష్యంగా దీనిని లాంచ్‌ చేయనున్నారు హోండా యాజమాన్యం.

పెట్రోల్‌తో నడిచే ప్రస్తుత తరం యాక్టివా కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధి చేస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా వెల్లడించారు. దేశీయ స్థానిక మార్కెట్ల నుంచే విడిభాగాలను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను తక్కువగానే ఉంటాయని సరసమైన ధరలకే కొనుగోలు దారులకు అందించనున్నట్టు వారు పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా అఫీసియల్ వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీని మార్చుకునే సదుపాయంతో వివిధ మోడళ్లలో ఈ వాహనాలను తీసుకురానుందని అంచనా. కాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్టంగా గంటకు 60 కి.మీ. మించదట. అలాగే ఈ టూవీలర్ ధర సుమారుగా 72,000-75,000 మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ప్రస్తుతం, ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో కేవలం బజాజ్ ఆటో, టీవీఎస్‌ మోటార్స్ టూ వీలర్ బ్రాండ్‌లు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. వీటితో పాటు వీటితోపాటు ఒకినావా, అథర్ ,ఓలా వంటి స్టార్టప్‌లు ఈ రంగంలో తమ హవాను కొనసాగిస్తున్నాయి. మరి తాజాగా హోండా కూడా ఈ ఎలక్ట్రికల్ టూ వీలర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తుండటంతో మారుతి సుజుకీ సహా దాదాపు అన్నీకంపెనీలు ఈ వాహనాలను లాంఛ్ చేయనున్నాయి.

ఇదీ చదవండి: Google : అతి త్వరలో గూగుల్ కొత్త ఫీచర్ మన ముందుకు రాబోతుంది!

Exit mobile version