LPG Cylinder: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. అంతకు ముందు వరకు పెరిగిన గ్యాస్ ధరల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మనం అందరికీ తెలిసిందే. మనం వాడుకునే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ రేట్లు ఒక్కసారిగా కంపెనీలు తగ్గించేశాయి. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.91.50 తగ్గించినట్టు తెలిసిన సమాచారం తగ్గించిన రేటు నేటి నుంచి అమల్లోకి రానుందని ఎల్‌పీజీ సిలిండర్ రేట్ల సమీక్షలో తెలిపారు. ఈ నెల ప్రారంభంలో మీరు కొత్త సిలిండర్ తీసుకునే సమయంలో మీకు రూ.91.50 తగ్గించి తీసుకుంటారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవలిసిన విషయం ఏంటంటే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు మాత్రమే తగ్గించారు. డొమెస్టిక్ సిలిండర్ రేటు మాత్రం అంతకు ముందు ఏ రేటు ఉందో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది.
పలు నగరాల్లో తగ్గిన సిలిండర్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు తగ్గించిన తరువాత ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.1,885గా ఉంది. ఇదే సిలిండర్ రేటు మే నెలలో ఐతే మనం కొనలేని విధంగా రూ.2,354 గా ఉంది. ఒక్క ఢీల్లీలో మాత్రమే కాకుండా మెట్రో నగరాల్లో కూడా కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేట్లు తగ్గాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.2,099.5 గా ఉండగా, ఏపీలోని విజయవాడలో ఈ రేటు రూ.2034 గా ఉంది. కోల్‌కతాలో ఐతే ఈ రేటు రూ రూ.1,995.50కు తగ్గిందని అలాగే ముంబైలో కూడా ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.1,844కు దిగొచ్చింది.