Site icon Prime9

Google: అతి చేసిన గూగుల్.. రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

cci fined google with 1338 crores

cci fined google with 1338 crores

Google: ఆధిపత్య దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద గూగుల్‌కు 1,337.76 కోట్ల జరిమానాను కాపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(CCI) విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు ఐసీసీ ఈ జరిమానా విధించింది. చట్టబద్ధంగా లేని వ్యాపార పద్ధతులను తక్షణం నిలిపివేయాలని కూడా గూగుల్‌ను ఆదేశించింది. ఈ ప్రవర్తనను మార్చుకోవడానికి గూగుల్ కు కొంత సమయం ఇచ్చింది.

భారతదేశంలో, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు గూగుల్‌ మీద 2019 ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. దాని మీద వివరణాత్మక విచారణకు రెగ్యులేటర్ ఆదేశించింది.
ఆండ్రాయిడ్ అనగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలు (OEMలు) ఇన్‌స్టాల్ చేసిన ఓపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌. ఇవి గూగుల్ తో కుదుర్చుకునే మొబైల్ మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (MADA), యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ (AFA) అనే ఒప్పందాలకు సంబంధించిన చట్టవ్యతిరేకమైన పద్ధతులపై CCIకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానితో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ యాప్స్‌ తప్పనిసరి ప్రి-ఇన్‌స్టలేషన్‌ కోసం MADAను అడ్డు పెట్టుకుని OEMలను నియంత్రించకూడదని గూగుల్‌కు CCI హెచ్చరికలు జారీ చేసింది. యాప్‌లన్నింటినీ స్మార్ట్‌ ఫోన్లలో ఏకమొత్తంగా ప్రి-ఇన్‌స్టాల్‌ చేసుకోవడం, వాటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేసే ఆప్షన్ లేకుండా చేయడం వంటివి పోటీ చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఫోన్లలో యాప్‌లను ఏ విధంగా అమర్చాలో OEMలకు గూగుల్‌ సూచించకూడదని కూడా CCI తేల్చి తెలిపింది.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. దీని సైజు ఎంతో తెలుసా..?

 

Exit mobile version