Traffic Restrictions: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పట్టుగొమ్మ అయిన పూలసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
బతుకమ్మ సంబురాలను ఎల్బీ స్టేడియంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనితో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసు సిబ్బంది తెలిపారు. బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆప్రాంతాల గుండా వెళ్లే వాహనాలు వేరే దారుల ద్వారా మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: మళ్లీ మూడు రోజులు వర్షాలేందిరా సామీ..!