Site icon Prime9

Congress: 11 మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు

tpcc-issues-show-cause-notices-to-11-spokespersons

tpcc-issues-show-cause-notices-to-11-spokespersons

Congress: రోజురోజుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కలహాలు కాస్త ఇప్పుడు బహిర్గతంగానే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని నేతలకు మధ్య సరైన పొంతన లేదు వారికి వారికే అసమ్మతి ఉందని వ్యక్తం అవుతుంది. కాగా తాజాగా కాంగ్రెస్  హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరయ్యారు. దానితో పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరయ్యారు. కాగా ఈ నేపథ్యంలో మిగిలిన 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో నేతలు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉపఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇలా జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఇదేమైనా కంపెనీనా.. ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ ఆయన పీసీసీ నిలదీశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జేబుకు చిల్లు

Exit mobile version