CS Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారుల విభజన సందర్భంగా సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
ఏపీకి వెళ్లడం ఇష్టం లేదు..
అయితే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇష్టం లేని సోమేష్ కుమార్(CS Somesh Kumar) తనను తెలంగాణకే కేటాయించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేవిట్ ట్రిబ్యునల్ (క్యాట్) లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ తర్వాత ఆయన్ని ఏపీకి వెళ్లాల్సిందేనంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2017లో మళ్లీ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమేష్ కుమార్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో కొనసాగింది. ఇప్పుడు తీర్పును వెళ్లడించింది. సోమేష్ కుమార్ కు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పదవీకాలం ఉంది. ఈ నేపధ్యంలో ఆయన ఏపీకి వెడతారా లేదా అన్నది చూడాలి.
2019లో అప్పటి చీఫ్ సెక్రటరీ జోషి రిటైరయిన తరువాత 14 మంది స్పెసల్ చీప్ సెక్రటరీలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. వీరిలో బీపీ ఆచార్య, బినయ్ కుమార్, అజయ్ మిశ్రా, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, సోమేష్ కుమార్, శాంతికుమారి, షాలినీ మిశ్రా, అధర్ సిన్హా, వసుధా మిశ్రాలు పోటీలో ఉన్నారు.ప్రధానంగా అజయ్ మిశ్రా, సోమేష్‌కుమార్ మధ్యే పోటీ నెలకొంది.తెలంగాణ సీఎం కేసీఆర్ సోమేష్‌కుమార్ వైపు మొగ్గు చూపారు. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాం : కేటీఆర్
మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత
ఐదేళ్లు అధికారం.. ఒక్కరోజు కూడా వదులుకోం.. ముందస్తుకు వెళ్లం- సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/