Site icon Prime9

Bandi Sanjay: ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

SSC Paper Leak Case

SSC Paper Leak Case

Bandi Sanjay: తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలకం రేపుతోంది. ఇకపోతే ఈ వ్యవహారం మరియు భాజపాపై వస్తున్న ఆరోపణలను భాజపా నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్పై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు.

హైదరాబాద్ శివార్లలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నలుగురు వ్యక్తులు భేటీ అయ్యి వారికి డబ్బు ఆశ చూపి వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే వారికి ఒక్కొకరికి రూ.100 కోట్ల నగదుతో పాటు కాంట్రాక్టులు, పదవులు కట్టబెడతామని ఆఫర్ చేశారు. అయితే ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి.. ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ నలుగురు వ్యక్తులు వెనుక బీజేపీ నేతలు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అధికార పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌ ఓ డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చేస్తున్న డ్రామాలు ఆ నేతలు చెప్తున్న కట్టు కథలు వింటున్న ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లే అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఎక్కడైనా స్వామిజీలు వెళతారా? అంటూ నిలదీశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల తలపై రూపాయి పెడితే.. అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరంటూ సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఫామ్ హౌజ్ టీఆర్ఎస్ వాళ్లదేనని.. అందులో ఉన్నది వాళ్లేనని, కంప్లైంట్ చేసిందే కూడా వాళ్లే అని ఆ ఎమ్మెల్యేలే మూడు రోజుల నుంచి భేటీ అయ్యి కుట్ర చేశారని మరి వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆరే ఈ నాటకానికి తెరలేపారని త్వరలోనే దీనిని బయటపెడతామని ఆయన చెప్పారు. ఆ ఎమ్మెల్యేలందరి ఫోన్ కాల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఏ ములుపు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం.. 400కోట్ల డీల్ తో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర

Exit mobile version