Air Show: రోడ్డు మీద ఒకదాని ఒకటి వాహనాలు ఢీ కొంటుంటాయి. మరి ఆకాశంలో నిత్యం అటూ ఇటూ చక్కర్లు కొట్టే విమానాలకు అలాంటి ప్రమాదాలు సంభవించవా అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగిందా.
అలాంటి క్రేజీ డౌట్స్ ఉన్న వారి సందేహాలను నిజం చేస్తూ తాజాగా గాల్లో తిరుగాడే రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ దుర్ఘటనలో 6 మంది మృతి చెందారు.
OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today
This is crazy
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. రెండు బాంబర్ విమానాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోయింగ్ బీ-17 బాంబర్ విమానం గాలిలోకి ఎగిరి ప్రయాణిస్తున్నది. ఇంతలో గాల్లో చక్కర్లు కొడుతున్న బెల్ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్ విమానం వచ్చి దానిని ఢీకొట్టింది. దానితో రెండు విమానాలు కూడా క్షణాల్లోనే కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణకు ఆదేశించాయి.
ఇదీ చదవండి మహిళ చేతి పై ముక్కు