Site icon Prime9

Pensions Hike: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. జనవరి నుంచి పింఛన్ పెంపు

cm jagan avanigadda tour

cm jagan avanigadda tour

Pensions Hike: చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో నేడు సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదును విడుదల చేశారు. అంతేకాదు కుప్పం నుంచి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్ పెంపును అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని, కుప్పం అంటే అక్కాచెల్లెమ్మల, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. కుప్పం వేదికగా రాష్ట్రంలో పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 2500 ఉన్న పింఛన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,750గా పెంచి అర్హులైన అభ్యర్థులకు అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కుప్పంకు చేరుకున్నారు. సీఎం హోదాలో జగన్ కుప్పంలో పర్యటించడం ఇదే మొదటిసారి.

ఇదీ చూడండి: CM Jagan: చంద్రబాబు అడ్డాలో సీఎం జగన్

Exit mobile version