Site icon Prime9

Jangaon: ఎంత ఘోరం.. మందుబాబు ప్రాణం తీసిన “ఆమ్లెట్”

man-died-after-omelet-stuck-in-throat at jangoan district telangana

man-died-after-omelet-stuck-in-throat at jangoan district telangana

Jangaon: ఆమ్లెట్ ఇష్టపడివారుండరు అనడంలో అతిశయోక్తి లేరు. శాఖాహారులు సహా మాంసాహారుల వరకు భోజనప్రియులైన వారు ఆమ్లెట్ అంటే లొట్టలేసుకుంటారు. అందులోనూ మందుబాబులైతే స్టఫ్ గా దానిని తెగ ఎంజాయ్ చేస్తారనుకోండి. అయితే నోట్లో వేసుకోగానే అమాంతం జారిపోయే ఈ ఆమ్లెట్ కూడా ప్రాణాలు తీస్తుందని ఎవరికైనా తెలుసా. గుడ్డు ఆమ్లెట్ తిని ఓ వ్యక్తి మరిణించాడు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఓ సారి చదవెయ్యండి.

ఎగ్ ఆమ్లెట్ ఓ మందుబాబు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈదులకంటి భూపాల్ రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి బచ్చన్నపేట గ్రామంలో నివాసిస్తుండేవాడు. కాగా గత రాత్రి స్థానిక మద్యం దుకాణంలోని మద్యం తాగుతూ ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుంటున్నాడు.
ఏమైందో ఏమోకానీ పొరపాటున ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇది గమనించిన పక్కనున్న మందుబాబు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కాగా అప్పటికే భూపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో బచ్చన్నపేట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ వార్త విన్న కొందరు ఆమ్లెట్ ఇరుక్కుని మరణించడం ఏంటంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఇదీ చదవండి: రక్తమోడిన రోడ్డు.. 11 మంది స్పాట్ డెడ్

Exit mobile version