Site icon Prime9

Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి బుమ్రా ఔట్

jasprit bumrah very emotional on his absence of india t20 wc

jasprit bumrah very emotional on his absence of india t20 wc

Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.

జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి తొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇపటివరకు అయితే అధికారికంగా వెల్లడించలేదు. కానీ త్వరలోనే బుమ్రా విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. గాయం కారణంగా ఇటీవల జరిగిన ఆసియా కప్‌ టోర్నీకి జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే గాయం నయమయిన వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు పునరాగమనం చేశాడు. అయితే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వచ్చి టీ20 ప్రపంచకప్ కు సిద్దమవుతాడని అందరూ భావిస్తుండగా మరోసారి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్లో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వెన్ను నొప్పికి ప్రస్తుతం సర్జరీ అవసరం లేదని 4 నుంచి 6 నెలల విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ఎలాంటి ప్రయాణాలు కూడా చేయోద్దని చెప్పడం వల్ల అక్టోబర్ 16 నుంచి ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్‌ 2022కి బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది.

ఇదీ చదవండి: సౌత్ఆఫ్రికా పై టీమిండియా బోణి కొట్టేసింది!

Exit mobile version