Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడితో మరణించిన ఫారెస్ట్ అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు.

  • Written By:
  • Publish Date - November 22, 2022 / 05:23 PM IST

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు..చండ్రుగొండ మండలం అబ్బుగూడెం సమీపంలో గల ఎర్ర బోడు వద్ద గల ప్లాంటేషన్ ప్లాంటేషన్ లో మొక్కలను గుత్తి కోయలు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దీనితో సెక్షన్ ఆఫీసర్ రాంబాబుతో కలిసి అక్కడకు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ద్విచక్రవాహనంపై వెళ్లారు.

రేంజ్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ పై చత్తీస్ గఢ్ కు చెందిన వలస గుత్తికోయలు ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో వారిపై విరుచుకుపడ్డారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఛాతి, మెడపై తీవ్రంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలారు .దాడి నుండి పారిపోయిన సెక్షన్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు.

పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ను చండ్రుగొండ ప్రాధమిక వైద్యశాలకు తరలించారు శ్రీనివాసరావు పరిస్ధితి  విషమంగా  ఉండటంతో ఆయనను కొత్తగూడెం నుంచి ఖమ్మం  కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.