Site icon Prime9

EAMCET Counselling: మరోసారి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా

eamcet second round counselling again postponed

eamcet second round counselling again postponed

EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. బుధవారం సెప్టెంబర్ 28న జరగాల్సిన ఈ కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.

ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 11,12న రెండో విడత స్లాట్ బుకింగ్ మొదలవుతుందని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు చెప్పారు. వచ్చే నెల 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, తదనంతరం 16వ తేదీన రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయని తెలిపారు. ఫీజులుపై  నిర్ణయం ఒక కొలిక్కి రాకపోవడం వల్లే రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు సమాచారం.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు

 

Exit mobile version