Himaja : తన అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన హిమజ .. రేవ్ పార్టీయే జరగలేదు అంటూ ..

Himaja : హిమజ కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంధరికి పరిచయం వున్న నటి . పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. ఇటీవలే హిమజ కొత్త ఇల్లు కట్టుకోగా నిన్న రాత్రి పలువురు టీవీ, సినీ ప్రముఖులకు ఇంట్లో పార్టీ ఇచ్చింది.

Himaja : హిమజ కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంధరికి పరిచయం వున్న నటి . పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. తాజాగా  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జెబి ఇన్‌ఫ్రా వెంచర్‌లోని హిమజ విల్లాలోఅర్థరాత్రి పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి. హిమజ నిన్న రాత్రి తన ఇంట్లో స్నేహితులకి దీపావళి పార్టీ మరియు హిమజ కొత్త ఇల్లు కట్టుకున్న సంధర్భంగ పార్టీ  ఇచ్చారు.దానికి  సినీ ప్రముఖులు ఎక్కువమంది వచ్చారంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీలు చేశారు. హిమజ ఇంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్, 14 పాయింట్ 9 లీటర్ల లిక్కర్‌ని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున హిమజసహా 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హిమజ ఇంట్లో రేవ్ పార్టీ అంటూ ప్రచారం జరిగింది. ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో నిన్న రాత్రి పోలీసులు  స్పెషల్ టీం తో హిమజ ఇంటికి వెళ్లి చెక్ చేశారు.  దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల కోడ్ ఉండగా హిమజ లిక్కర్ పార్టీ, రేవ్ పార్టీ చేసుకున్నందుకు అరెస్ట్ అయిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి . దీనితో హిమజ అరెస్ట్ నిజమో కాదో అనే డౌట్ ప్రతి ఒక్కరిలో వుంది.దీనిని ఖండిస్తూ హిమజ ఓ వీడియో విడుదల చేశారు.

 

నన్నెవ్వరూ  అరెస్ట్ చేయలేదు.. (Himaja)

ఈ వీడియోలో హిమజ మాట్లాడుతూ.. నన్నెవ్వరూ అరెస్ట్ చేయలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. నేను అరెస్ట్ అయ్యాను అని తప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ వీడియో పెట్టి క్లారిటీ ఇస్తున్నాను. కొత్త ఇంట్లోకి మారినందుకు మా ఫ్రెండ్స్, కొంతమంది టీవీ, సినిమా వాళ్ళని పిలిచి మా ఇంట్లోనే పార్టీ చేసుకున్నాను. ఎవరో తప్పుగా అర్ధం చేసుకొని పోలీసులకి చెప్తే ఎన్నికల కోడ్ కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేసి, ఇక్కడ తప్పుగా ఏం జరగట్లేదని వెళ్లిపోయారు అంతే. నేను పోలీసులకు క్లారిటీ ఇచ్చాను. కొంతమంది నేను అరెస్ట్ అయ్యానని తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. అందరూ నాకు ఫోన్స్ చేస్తున్నారు. పండగ పూట ఇలా చేయడం కరెక్ట్ కాదు. సంతోషంగా ఉండాల్సిన రోజు. నేను పూజకి అన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను. దయచేసి తప్పుడు వార్తలు రాయకండి, నమ్మకండి అని తెలిపింది. దీంతో హిమజ వీడియో వైరల్ గా మారింది.