Site icon Prime9

CM KCR: ఒళ్లు మ‌రిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతుంది.. జర ఆలోచించండి- సీఎం కేసీఆర్

cm kcr speech in bangarugadda at munugode

cm kcr speech in bangarugadda at munugode

CM KCR: మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాక పుట్టిస్తున్నాయి. యావత్ రాష్ట్రప్రజలతో ఏ రోజు అక్కడ ఏం జరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇంకా వేడిమీదే ఉండగా నేడు కేసీఆర్ ఉపఎన్నికల ప్రచారంలో కాలు పెట్టారు. బైపోల్స్ లో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఓటుపై అవగాహణ కల్పించారు. మీకు చేతులెత్తి మొక్కుతున్న ఒక్కసారి సోచాయించండంటూ ఆయన తెలిపారు. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. దానిని అలవోకగా వేస్తే అంతే సంగతులు. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతుంది, చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడులను బేరీజు వేసి ఓటు వెయ్యండంటూ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఆలోచించి ఓటు వెయ్యడం ద్వారా మీ బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయని ఆయన తెలిపారు. ఎవ‌రో ఏదో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డబ్బులిచ్చారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు అంటూ ఆయన తెలిపారు. ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చిందని ఈ బైపోల్స్ ఫ‌లితం ఎప్పుడో మీరు తేల్చేశారని తెలునని ఆయన తెలిపారు. నేను కొత్త‌గా మీకు చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు. ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌నే ఇక్క‌డికి వ‌చ్చానుంటూ ప్రసంగం మొదలుపెట్టారు.

దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఎక్కడ ఏం జ‌రుగుతుందో జాగ్రత్తగా ఆలోచించాలని ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఓటెయ్యాలని చెప్పారు. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి.. గాడిదకు గడ్డివేసి గేదెకు పాలుపితకడం న్యాయం కాదు అంటూ తనదైన స్టైల్ లో పంచులు వేశారు. ప్రజల్లో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు రాచుకుంటుంటాయని, దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని కేసీఆర్ సూచించారు. మీరే నాకు బలం మీ బలం ఉంటేనే నేను ఈ రాజకీయ అరాచక శక్తులతో పోరాడగలనని ప్రజలతో చెప్పారు. బీజేపీ నేతలు వందల కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినా వాటికి లొంగని మన ఎమ్మెల్యేలు నిజమైన హీరోలు, తెరాస నేతలు ఇలాంటి ప్రలోభాలకు నమ్మరని రుజువు చేసిన అసైన రాజకీయ నేతలని అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా పరుగు తీసిన రాహుల్.. జోడో యాత్రలో చిత్ర విచిత్రాలు

Exit mobile version