Site icon Prime9

Chandigarh University: ఈ నెల 24వరకు చండీగడ్ యూనివర్సిటీ బంద్… గర్ల్స్ హాస్టల్ వార్డెన్ సస్పెండ్

Chandigarh university bandh

Chandigarh university bandh

Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్ను సస్పెండ్ చేశారు.

పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలోని బాలికల హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్ విద్యార్థుల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన నేపథ్యంలో స‌స్పెండ్ చేశారు. వ‌ర్సిటీని ఈనెల 24వ తేదీ వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. దీనితో త‌మ పిల్ల‌ల్ని తీసుకువెళ్లేందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు వ‌ర్సిటీకి వ‌చ్చారు.

కాగా అమ్మాయిల ప్రైవేటు వీడియోల‌ను రిలీజ్ చేసిన అమ్మాయిని అరెస్టు చేస్తున్న స‌మ‌యంలో పోలీసుల్ని హాస్ట‌ల్ వార్డెన్ అడ్డుకున్న‌ట్లు తెలిసింది. నిర‌స‌న చేసిన విద్యార్థినిల‌ను కూడా ఆమె తిట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈమేరకు హాస్టల్ వార్డెన్ పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. కాగా ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ మనీషా గులాటీ ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. వీడియోల‌ను ఎవ‌రెవ‌రికి షేర్ చేశారు, ఎక్క‌డెక్క‌డ అప్‌లోడ్ చేశార‌న్న కోణంలో ఫోరెన్సిక్ పోలీసులు విచార‌ణను వేగవంతం చేశారు.

ఇదీ చదవండి: Kerala Auto Driver: ఆటో డ్రైవర్ కు లాటరీలో 25 కోట్లు

Exit mobile version
Skip to toolbar