Site icon Prime9

Breaking News: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. నదిలో పడిపోయిన 400 మంది

gujarath morbi cable bridge collapse

gujarath morbi cable bridge collapse

Breaking News: గుజరాత్‌‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పై ఉన్న దాదాపు 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం.

గుజరాత్‌‌ మణిమందిర్ సమీపంలోని మాచ్ నదిపై ఈ వేలాడే వంతెన నిర్మితమై ఉంది. జనం భారీగా రావడం వల్ల కేబుల్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే బ్రిడ్జ్ కూలే సమయంలో దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఉన్నారని వారంతా ఆ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల క్రితం ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేశారని తిరిగి ఈ బ్రిడ్జిని ఇటీవలే మరల పునఃప్రారంభించారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆదివారం కావడంతో మాచ్ నది అందాలను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున బ్రిడ్జ్ పైకి వచ్చారు వెల్లడించారు. వంతెన సామర్థ్యాన్ని మించి జనాలు రావడంతో కేబుల్స్ ఒక్కసారిగా తెగిపోయాయని దానితో బ్రిడ్జ్ కూలిపోయి జనాలు నదిలో పడిపోయారన్నారు. వారందరినీ సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.

దర్బార్‌ఘర్ నుండి నాజర్‌బాగ్‌కు అనుసంధానించబడి ఈ కేబుల్ బ్రిడ్జ్ ను 1880 శతాబ్ధంలో నిర్మించారు. 140 ఏళ్లకుపైగా చరిత్ర గల ఈ వంతెన పొడవు సుమారు 765 అడుగులు. కాగా ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అప్పట్లోనే దాదాపు 3.5 లక్షల వ్యయంతో దీన్ని బ్రిడ్జ్ ను నిర్మించారట.

ఇదీ చదవండి: జంట బాంబు పేలుళ్లు.. 100 మందికిపైగా మృతి

Exit mobile version