Munugode: తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
ఈ ఉపఎన్నికల బరిలో 47మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నియోజకవర్గం మొత్తంగా 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా మొత్తం 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉపఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 5,500 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించారు.
ఇదీ చదవండి: తెగ తాగారు.. మునుగోడులో గుట్టలుగా ఖాళీ మద్యం సీసాలు