TSRTC: దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని 67 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ వెల్లడించారు. 32 బస్సుల్లో 216 సీట్లు, 35 బస్సుల్లో 393 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏసీ బస్సుల్లో రూ.1040, సూపర్‌లగ్జరీలో రూ.842 గా టికెట్ ధరలు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.
దసరా సందర్భంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను కేటాయించిన సంగతి తెలిసింది. 15రోజుల సెలవుల నేపథ్యంలో భాగ్యనగరం ప్రజలు పెద్ద ఎత్తున వారివారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీ బస్సులు ఫుల్ అయ్యాయి. అవే కాక పలు వాహనాలైన కార్లు, ద్విచక్రవాహనాల ద్వారా కూడా ప్రజలు ప్రయాణాలు సాగించారు.
ఇదీ చదవండి: ఉబర్, ర్యాపిడోలకు షాక్.. ఆటో సేవలు రద్దు చెయ్యాలంటూ ఆదేశం