Site icon Prime9

Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వీసులు డౌన్.. సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్

microsoft

microsoft

Microsoft: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ లో సభా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.

ఔట్ లుక్, ఎంఎస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సేవలు పనిచేయలేదు. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో అప్రమత్తమైన మైక్రోసాఫ్ట్(Microsoft) దర్యాప్తు చేపట్టింది. అయితే ఎంతమంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందనే విషయం కంపెనీ వెల్లడించలేదు.

పలు దేశాల్లో నిలిచిన సేవలు

ఇండియా తో సహా బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగింది.

అవుట్ లుక్ వెబ్ సైట్లు రీఫ్రెష్ అవ్వడం లేదని, ఈ మెయిల్ రావడం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

భారత్ లో ఇప్పటి వరకు 3700 మంది యూజర్లు ఈ అంశంపైన కంప్లైంట్ చేసినట్టు డౌన్ డిటెక్టర్. కామ్ తెలిపింది.

ఎంఎస్ టీమ్స్ నుంచి మెయిల్స్ చేయలేకపోతున్నామని పలువురు ట్వీట్లు పెట్టారు.

అవుట్ లుక్ , టీమ్స్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ లోని ఇతర సేవలు కూడా పనిచేయడం లేదని మరికొంద యూజర్లు తెలిపారు.

కాగా జపాన్ నుంచి 900 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు.

సమస్య మైక్రోసాఫ్ట్(Microsoft) రివ్యూ

అయితే సేవల అంతరాయంపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యకు గల కారణాలపై రివ్యూ చేస్తున్నట్టు తెలిపింది.

టెక్నికల్ ఎర్రర్ కారణంగా ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ కు 28 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. టీమ్స్ ను ఎక్కువగా వ్యాపారం, స్కూళ్లో వినియోగిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ మొరాయించడంపై పలువురు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ.. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ పలు ఇన్ స్టా వంటి దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్లు అన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో సర్వర్లు డౌన్ అవడం మళ్లీ వాటిని పునరుద్దరించడం జరిగిన సంగతి మనకు తెలిసిందే.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version