Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.
టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి గౌతమ్ అదానీ పేరు మాయమైంది.
గత మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి అదానీ గ్రూప్(Adani Group) షేర్లు వరుసగా పతనం అవ్వడమే దీనికి కారణం.
బ్లూమ్ బర్గ్ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ల డాలర్లతో 11 స్థానంలో ఉన్నారు.
కాగా, గత మూడు ట్రేడింగ్ సెషన్స్ లో అదానీ 3 రోజుల్లో 34 బిలియన్ల డాలర్లు పొగొట్టుకున్నారు. దానివల్లే ఆయన 3 వ స్థానం నుంచి 11 వ స్థానానికి పడిపోయారు.
భారత్ నుంచి టాప్ 10 లో స్థానం దక్కించుకున్న అదానీ.. కొంతకాలం అదే స్థానంలో కొనసాగారు.
అయితే ఎప్పుడైతే హిండెన్ బర్గ్ నివేదిక వచ్చిన నాటి నుంచి అదానీ సంపద ఆవిరైపోయింది.
కొనసాగుతున్న లోయర్ లిమిట్
అదానీ గ్రూప్ షేర్ల విలువ మూడు రోజుల్లో భారీగా పడిపోయింది. ఈ క్రమంలో 68 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటిలైజేషన్ కోల్పోయింది.
మంగళవారం కూడా అదానీ గ్రూప్ షేర్స్ లోయర్ లిమిట్ ను తాకాయి. అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 2 శాతం, అదానీ విల్మర్ 5 శాతం,
అదానీ పవర్ లిమిటెడ్ 4.9 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 0.6 శాతం పతనం అయ్యాయి.
12 వస్థానంలో అంబానీ
కాగా, బ్లూమ్ బర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే 189 బిలియన్ డాలర్లతో అత్యధిక సంపన్నుడిగా బెర్నాల్డ్ ఆర్నాల్డ్ కొనసాగుతున్నారు.
ఆ తర్వాతి స్థానంలో ట్విటర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. మూడవ స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోజ్ నిలిచారు.
ఇక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 82.2 బిలియన్ల డాలర్లతో 12 వస్థానంలో ఉన్నారు.
413 పేజీల వివరణ ఇచ్చిన అదానీ గ్రూపు
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది.
దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది.
ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి.
ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి.
ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది. అయితే ఈ నివేదికపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది.
ఈ నివేదికపై వివరణ ఇచ్చిన అదానీ గ్రూపు పలు ఆరోపణలు చేసింది.
భారత్ వృద్ధిపై అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేసిందని తెలిపింది.
భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధి చూడలేకనే.. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిందని వివరించింది.
ఇవి పూర్తిగా అసత్య ఆరోపణలు అంటూ.. 413 పేజీల స్పందనను తెలియజేసింది.
మార్కెట్‌లో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి.. ఆర్థిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చినట్లు అదానీ గ్రూపు పేర్కొంది.
వారికి నచ్చిన విధంగా.. తప్పుడు సమాచారంతో నివేదిక రూపొందించారని ఆరోపించింది.
ఇలా అసత్య ఆరోపణలతో.. దాడులు చేయడం సరికాదని అదానీ గ్రూప్ అభిప్రాయపడింది.
ఇలా చేయడం ద్వారా.. జాతీయ సమగ్రతకు భంగం కలుగుతుందని.. దేశం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/