Prime9

Avinash Reddy: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. బుధవారం వరకు అరెస్ట్ చేయోద్దని హై కోర్టు సూచన

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను నేడు హై కోర్టు విచారించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 31 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలిపింది. ఈ నెల 31న తీర్పు ప్రకటిస్తామని తెలిపింది.

హై కోర్టులో ఊరట..

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను నేడు హై కోర్టు విచారించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 31 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలిపింది. ఈ నెల 31న తీర్పు ప్రకటిస్తామని తెలిపింది.

అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును ఈ నెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ నెల 31న దీనిపై తీర్పు ప్రకటిస్తామని తెలిపింది.

వివేకానంద హత్య కేసులో.. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి. హైకోర్టుకు సీబీఐ పలు కీలక విషయాలు తెలిపింది. విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని ఇందులో పేర్కొంది.

విచారణను తమ పద్ధతిలో చేస్తామని, అంతేగాని అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా చేయబోమని పేర్కొంది. పిటిషన్ పై నేటితో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది.

Exit mobile version
Skip to toolbar