Prime9

పవన్ కళ్యాణ్: వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు.. వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్‌ కల్యాణ్‌ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

ఇటీవల కాలంలో పవన్‌ కళ్యాణ్ పై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఆయనను వారాంతపు పొలిటీషియన్ అని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా పవన్ ఈ సభలో తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వారాంతపు పొలిటీషియన్ అని విమర్శిస్తున్నారు. వారంలో ఒకసారి రాజకీయం చేస్తేనే ఇంత గోల చేస్తున్నారు. వారం రోజులు చేసే రోజులు వస్తాయని ఘాటుగా స్పందించారు. నాకు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, మీలాగా అడ్డగోలుగా దోచుకోవట్లేదు. కష్టపడి సంపాదించుకుంటున్నాను అని తెలిపారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar