Prime9

EX Sarpanch Suicide Attempt: సచివాలయంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..

Kuppam: మాజీ సర్పంచ్ సచివాలయం గుమ్మానికే ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వినతులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని గోపాల్ ఆరోపిస్తున్నారు.

మంగళవారం ఉదయం క్షేత్ర పరిశీలన చేపట్టిన అధికారులు సమస్యను మాత్రం పరిష్కరించలేదు. దీంతో అధికారుల తీరు పై గోపాల్ తీవ్రఆవేదన వ్యక్తం చేసారు. చివరకు శాంతిపురం మండల సచివాలయం గుమ్మానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా సచివాలయ అధికారులు అతన్ని అడ్డుకున్నారు.

 

Exit mobile version
Skip to toolbar