Prime9

CM Chandrababu @Vizag: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. యోగా డే ఏర్పాట్ల పరిశీలన!

CM Chandrababu Visits Visakhapatnam Today: ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని.. పార్క్ హోటల్ వరకు అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నోవాటెల్ హోటల్ లో.. యోగా డే వేడుకలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.

 

మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్ హోటల్ నుంచి బయల్దేరి.. మ. 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. యోగా డే వేడుకలకు సంబంధించి పార్టీ నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్తారు. అనంతరం తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

Exit mobile version
Skip to toolbar