Site icon Prime9

Tomato Price Drop: ధర ఢమాల్.. కిలో టమోటా 50 పైసలే!

50 paise per kilo of tomato in Pattikonda

Pattikonda: పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50 పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్టులో నిన్నటిదాక రూ. 5 రూపాయలు పలికిన టమోట ధర నేడు అమాంతం పడిపోవడంతో రైతుల మోము నల్లబారింది. కూలీలు, రవాణా ఖర్చులకు కూడా ధర పలకకపోవడంతో రైతులు భోరుమన్నారు. మార్కెట్టులోనే టమోటాను పారబోశారు. పండించిన పంటను కోసి మార్కెట్టుకు తరలిస్తుంటే కనీసం రవాణా ఖర్చులకు కూడా రావడం లేదంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

పంట సాగును ప్రారంభించే సమయంలో ధర ఎక్కువగా ఉందని, అధిక సంఖ్యలో సాగు చేపట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా ధర పతనమై నష్ట పోతున్నామని రైతులు వాపోతున్నారు. మూడేళ్ల క్రితం పత్తికొండ మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటామని ప్రకటన చేశారు. అయితే ఆ హామీని అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:Insecticide: ఆ మందు అమ్మకం, వినియోగంపై నిషేధం

Exit mobile version