Site icon Prime9

Chhattisgarh: చెప్పుతో కొట్టి.. ఆసుపత్రి నుంచి తన్నితరిమేశారు..!

woman-slaps-man-kicks-him-for-questioning-her-over-turning-off-cooler-in-chhattisgarhs-ambikapur-medical-college

woman-slaps-man-kicks-him-for-questioning-her-over-turning-off-cooler-in-chhattisgarhs-ambikapur-medical-college

Chhattisgarh: కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఛత్తీస్గర్ రాష్ట్రంలోని అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఓపీడీలో ఓ మహిళ అక్కడ ఉన్న కూలర్ను ఆపేసింది. అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి సడెన్ గా నిద్రలేచి కూలర్ ఎందుకు ఆఫ్ చేశారు అని ఆమెను ప్రశ్నించాడు. దానితో వారి మధ్య వాగ్వాదం పెరిగి ఆమె ఆక్రోషంతో అతన్ని చెప్పుతో చితకబాదింది. అయితే ఒక రోగికి చలిగా అనిపించడంతోనే ఆ మహిళ కూలర్ ఆపేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. కాగా స్థానికంగా ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని విచారించగా, తన బంధువులు ఎవరూ ఆసుపత్రిలో చేరలేదని, వేడి ఎక్కువగా ఉన్నందువల్ల తాను ఆసుపత్రిలోనే నిద్రిస్తున్నానని చెప్పాడు. దానితో అతన్ని మందలించిన పోలీసులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: ఇదేం ఆచారం రా దేవుడా.. కట్నం కింద వరుడికి 21 పాములు..!

Exit mobile version