Prime9

Uttar Pradesh: ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

Uttar Pradesh: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడే బుద్దిలేనట్టుగా వ్యవహరించాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నంది.

ఉత్తరప్రదేశ్‌ అజంగఢ్‌లోని ఫుల్‌పూర్ పోలీసు పరిధిలోని సరాయ్ ఖుర్ద్ ప్రాథమిక పాఠశాల ఓ ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తోన్నారు. కాగా అతను తరగతి గదిలో విద్యార్థినుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తింస్తున్నారని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధిత బాలికలు ఇంటికెళ్లి తమ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పారు. దానితో బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టి దేహ శుద్ధి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూల్పూర్ పోలీసులు పాఠశాలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల ఎదుట బాలికలు తరగతిలో పాఠం చెప్పేటప్పుడు బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని, తమను అనుచితంగా ఎక్కడపడితే అక్కడ తాకాడని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఈ పానీపూరీ రూటే సపరేటు.. గోలగప్ప ఫౌంటెన్..!

Exit mobile version
Skip to toolbar