Site icon Prime9

Viral Video: ఇది బైక్ కాదు భయ్యో.. మినీ బస్

man-drives-bike-with-six-passengers-and-two-dogs-video-shocks-netizens and goes viral

man-drives-bike-with-six-passengers-and-two-dogs-video-shocks-netizens and goes viral

Viral Video: ఒక బైక్ అంటే సాధారణంగా ఇద్దరు మహా అంటే ముగ్గురు వరకు ప్రయాణించేందుకు అనుకూలం. మూడో వారు కూర్చుంటేనే ఇరుకుగా ఉంటుంది. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ పై భార్య, ఐదుగురు పిల్లలను, రెండు పెంపుడు కుక్కలు, లగేజీని తగిలించుకుని దర్జాగా వెళ్తున్నాడు. దానితో చుట్టూ ఉన్న తోటి వాహనదారులు నోరెళ్లబెట్టారు. వారిలో ఒక్కరంటే ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఇది బైక్ కాదు భయ్యా మినీ బస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే అసలు ఎలా ఇలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు పట్టుబడితే, చలాన్లు కట్టేందుకు ఈ వ్యక్తి రుణం తీసుకోక తప్పదంటూ ఓ నెటిజన్ హాస్యంగా కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే ‘చలాన్లు ఏమీ ఉండవు. వీరిని ఆపిన వారు, అసలు ఇంత మంది ఎలా సర్దుకున్నారంటూ ఆశ్చర్యపోతారు’అని కామెంట్లు రాసుకొచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా చూశారు. ఈ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. అసలు ఎందుకు ఇలా ఇరుక్కుని మరీ ప్రయాణం చేస్తున్నారనే వివరాలు తెలియరాలేదు.

ఇదీ చదవండి: గుండ్రంగా తిరుగుతూ చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. వీడియో వైరల్

Exit mobile version