Viral News: పాములు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపి మింగిసిన ఉదంతాలను అనకొండ లేదా ఇతరత్రా మూవీలోస్ చూసి ఉంటాం కానీ నిజ జీవితంలో అలాంటి ఘటనలను చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ తరహాలోనే ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను భారీ కొండచిలువ మింగేసింది.
సుమత్రా, జాంబి ప్రావిన్స్‌కు చెందిన 54 ఏళ్ల జారా అనే మహిళ రబ్బర్ ఏరేందుకు అడవిలోకి వెళ్లింది. కాగా రెండు రోజులైనా ఆమె జాడ కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు జారాను గాలిస్తూ అడవిలో వెళ్లారు. ఈ తరుణంలోనే ఓ చోట ఆమె చెప్పులు, కత్తి, తదితర వస్తువులు కనిపించాయి. దీనితో వారు గ్రామస్థులు, అధికారుల సహకారంతో అడవి మొత్తం జల్లెడపట్టగా వారికి అక్కడ ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాని కడుపు ఉబ్బి ఉండటాన్ని గమనించిన స్థానికులు అదృశ్యమైన జారాను కొండచిలువే మింగేసి ఉంటుందని భావించారు.
దానితో గ్రామస్థులందరూ కలిసి ఆ భారీ కొండచిలువును చంపి పొట్టను చీల్చి చూడగా మహిళ కడుపులో పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు.
కాగా దీనికి సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో 27 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించిందని స్థానికులు అంటున్నారు.
A female rubber plantation worker in #Jambi province #Indonesia was found dead after being swallowed by a 6-meters-long python snake.@AJEnglish @BBCNews @trtworld @Reuters @NikkeiAsia @ChannelNewsAsia @telesurenglish @France24_en https://t.co/L0Z1OhcSWY pic.twitter.com/yF13OUqw92
— Hasto Suprayogo (@HastoSuprayogo) October 25, 2022
ఇదీ చదవండి: భక్తులకు ప్రసాదంగా డబ్బులు పంపిణీ.. క్యూ కట్టిన ప్రజలు.. ఎక్కడంటే..?