Site icon Prime9

Fire Hair Cut: ఈ హెయిర్ కట్ మహా డేంజర్ గురూ.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

a boy injured with fire hair cut in Gujarat

a boy injured with fire hair cut in Gujarat

Fire Hair Cut: మగపిల్లలకు జట్టు మీద కాస్త మోజు ఎక్కువే.. అందరూ అమ్మాయిలకే జుట్టు అంటే ఇష్టం అనుకుంటారు కానీ అని నిజం కాదు. బార్బర్ షాప్ కు వెళ్లి కొత్త కొత్త డిఫరెంట్‌ కటింగ్స్ చేయించుకుంటుంటారు అబ్బాయిలు. ఈ సందర్భంగానే ఓ యువకుడు ఓ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించుకుందామని వెళ్లి జుట్టు మొత్తం కాలిపోయి గాయాలపాలయ్యాడు.
ఫైర్‌తో హెయిర్ కట్ అంటూ ఓ వింత హెయిర్ స్టైల్ కోసం ప్రయత్నించి గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

వల్సాద్ జిల్లా వాపిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రక్‌మోరా ప్రాంతంలో నివాసి అయిన ఓ 18ఏళ్ల యువకుడు సుల్పాడ్ ప్రాంతంలో ఉన్న ఒక బార్బర్ షాప్‌కు ‘ఫైర్ హ్యారీకట్’ చేయించుకోవడానికి వచ్చాడు. కాగా అతనికి ఏదో ఒక రసాయనాన్ని పూసి అగ్గిపెట్టతో బార్బర్ తలకు నిప్పంటించి హెయిర్ కటింగ్ చేయబోయాడు. అంతలోనే ఆ మంటలు కాస్త తలమొత్తం వ్యాపించి యువకుడు అరుపులు పెట్టడం ప్రారంభించారు. తోటి వ్యక్తులు ఆ మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో యువకుడి గొంతు, ఛాతీ భాగం కాలిపోయింది. దానితో అతన్ని సూరత్‌లోని ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి వాంగ్మూలం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. బార్బర్ షాపు వ్యక్తిని కూడా విచారిస్తున్నామని చెప్పారు. ‘ఫైర్‌ హ్యారీకట్‌’కు ఏ రసాయనాన్ని ఉపయోగించారనేది నిర్ధారణ జరుగుతోందని అన్నారు.

ఇదీ చదవండి: సింహం ఎప్పుడు సింహమే గురు!

Exit mobile version