Kamal Haasan : యూనివర్సల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే విక్రమ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేయబోతున్నారు. 1987లో విడుదలైన నాయగన్ సినిమా తర్వాత కమల్ హాసన్, మణి రత్నం కలిసి సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీలో విద్యాబాలన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.
Kamal Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ.. విద్యాబాలన్

vidyabalan going to act as heroin in kamal haasan and maniratnam movie