MLA Rapaka Varaprasad : రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. అయితే రాపాక తన కుమారుడి వివాహానికి ఏర్పాట్ల విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. అదే విధంగా వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో రాయించారు. వారిని దైవ సమానులుగా పేర్కొంటూ ఈ విధంగా చేయడం పట్ల మరి ఇంత భజన ఎందుకు స్వామి అంటూ నెటిజన్లు పోస్ట్ లు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MLA Rapaka Varaprasad : ఏకంగా కొడుకు పెళ్లి కార్డుపై సీఎం జగన్, భారతి ఫోటోలు వేయించిన ఎమ్మెల్యే రాపాక.. ఇదేం భజన అంటూ కామెంట్స్ !

cm jagan and bharathi images in mla rapaka varaprasad son marriage invitation card